జిల్లా వ్యాప్తంగా పోలీస్ యాక్ట్ అమలు: మెదక్ ఎస్పీ డీవీ. శ్రీనివాస రావు
మెదక్, 3 నవంబర్ (హి.స.) ఈ నెల 3 నుంచి 30 వరకు మెదక్ జిల్లా శాంతి భద్రతల పరిరక్షణ దృష్ట్యా జిల్లా వ్యాప్తంగా 30, 30(ఎ) పోలీసు యాక్ట్ 1861 అమలులో ఉంటుందని జిల్లా ఎస్పీ డీవీ. శ్రీనివాస రావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప
మెదక్ ఎస్పి


మెదక్, 3 నవంబర్ (హి.స.)

ఈ నెల 3 నుంచి 30 వరకు మెదక్

జిల్లా శాంతి భద్రతల పరిరక్షణ దృష్ట్యా జిల్లా వ్యాప్తంగా 30, 30(ఎ) పోలీసు యాక్ట్ 1861 అమలులో ఉంటుందని జిల్లా ఎస్పీ డీవీ. శ్రీనివాస రావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీసు అధికారుల ముందస్తు అనుమతి లేకుండా ఏ విధమైన ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలు, ర్యాలీలు, పబ్లిక్ మీటింగ్స్, సభలు, సమావేశాలు నిర్వహించకూడదని తెలిపారు. ప్రజల/ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగించే చట్ట వ్యతిరేక చర్యలు, అశాంతి సృష్టించే ప్రయత్నాలు ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని స్పష్టం చేశారు. శాంతి భద్రతల నిర్వహణలో ఎవరైనా విఘాతం కలిగిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande