గోదావరి నదిలో యువకుడి గల్లంతు పై మంత్రి శ్రీధర్ బాబు ఆందోళన
పెద్దపల్లి, 3 నవంబర్ (హి.స.) పెద్దపల్లి జిల్లాలోని మంథని పట్టణంలోని మర్రివాడకు చెందిన రవి కంటి సాయి (30) అనే యువకుడు ఈ రోజు ఉదయం గోదావరిలో స్నానం చేయడానికి వెళ్లి గల్లంతైన విషాద సంఘటన చోటు చేసుకుంది. కాగా ఈ సంఘటనపై రాష్ట్ర మంత్రి శ్రీ దుద్దిళ్ల
మంత్రి శ్రీధర్ బాబు


పెద్దపల్లి, 3 నవంబర్ (హి.స.)

పెద్దపల్లి జిల్లాలోని మంథని పట్టణంలోని మర్రివాడకు

చెందిన రవి కంటి సాయి (30) అనే యువకుడు ఈ రోజు ఉదయం గోదావరిలో స్నానం చేయడానికి వెళ్లి గల్లంతైన విషాద సంఘటన చోటు చేసుకుంది. కాగా ఈ సంఘటనపై రాష్ట్ర మంత్రి శ్రీ దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆందోళన వ్యక్తం చేస్తూ,గల్లంతైన వ్యక్తి ఆచూకీ కోసం వెంటనే గాలింపు చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించడం తో పాటు యువకుడి ఆచూకీపై ఆరా తీశారు. సమాచారం అందుకున్న వెంటనే ఉదయం నుంచి మంథని పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, మంథని మున్సిపల్ అధికారులు, రెవెన్యూ అధికారులు సంఘటన స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు ప్రారంభించారు. గల్లంతైన రవి కంటి సాయి ఆచూకీ గోదావరిలో తీవ్రంగా కోసం శోధిస్తున్నారు.మంత్రి శ్రీధర్ బాబు గల్లంతైన వ్యక్తి కుటుంబ సభ్యులతో ఫోన్ ద్వారా మాట్లాడి ధైర్యం చెప్పి, భరోసా ఇచ్చారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande