మీర్జాగూడ బస్సు ప్రమాదం.. మృతుల కుటుంబాలకు రూ.7 లక్షల ఎక్స్ గ్రేషియా
హైదరాబాద్, 3 నవంబర్ (హి.స.) రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలో జరిగిన ఆర్టీసీ బస్సు, టిప్పర్ ప్రమాదం అంతులేని విషాదం నింపింది. ఈ ఘటనలో ఇప్పటి వరకు 21 మంది ప్రాణాలు కోల్పోగా మృతుల సంఖ్య మరింతే పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఈ ప్రమాదంపై రాష్ట్ర ప్ర
మంత్రి పొన్నం


హైదరాబాద్, 3 నవంబర్ (హి.స.)

రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలో జరిగిన ఆర్టీసీ బస్సు, టిప్పర్ ప్రమాదం అంతులేని విషాదం నింపింది. ఈ ఘటనలో ఇప్పటి వరకు 21 మంది ప్రాణాలు కోల్పోగా మృతుల సంఖ్య మరింతే పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఈ ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ఎక్స్ గ్రేషియా (ex gratia) ప్రకటించింది. ప్రమాదంలో మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ.5 లక్షలు, ఆర్టీసీ తరఫున రూ.2 లక్షలు అలాగే క్షతగాత్రులకు రూ.2 లక్షల చొప్పున పరిహారం అందిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. ఇవాళ ఉదయం చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రిలో క్షతగాత్రులను పరామర్శించిన అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. ఈ ప్రమాదంపై విచారణకు ఆదేశించినట్లు చెప్పారు. మృతదేహాలకు చేవెళ్లలోనే పోస్ట్ మార్టం నిర్వహిస్తామని వెల్లడించారు. ---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande