
తెలంగాణ, 3 నవంబర్ (హి.స.)
సమస్యలను పరిష్కరించాలని కోరుతూ జిల్లాలోని ప్రజలు సమర్పిస్తున్న దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి సమస్యల పరిష్కారం కోసం సంబంధిత అధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ అన్నారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఆర్డిఓ వెంకటేష్తో కలిసి ఫిర్యాదు దారుల నుండి దరఖాస్తులను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పలు సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ప్రజలు సమర్పిస్తున్న దరఖాస్తులను ఆయా శాఖల అధికారులు పూర్తిస్థాయిలో పరిశీలించి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని అన్నారు. సోమవారం జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో 46 దరఖాస్తులు రాగా ఆయా దరఖాస్తులను సంబంధిత శాఖల అధికారులకు బదిలీ చేశారు. కార్యక్రమంలో జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు