సజావుగా సోయా కొనుగోళ్లు : నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్
నిర్మల్, 3 నవంబర్ (హి.స.) నిర్మల్ జిల్లాలో సోయాబీన్ కొనుగోలు ప్రక్రియ సజావుగా కొనసాగుతోందని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. సోమవారం ఆమె మాట్లాడుతూ రైతులకు ఉదయం 6 గంటల టోకెన్లు జారీ చేయడం ప్రారంభమైందని, అన్ని కొనుగోలు కేంద్రాల్లో ఎటువంటి
నిర్మల్ జిల్లా కలెక్టర్


నిర్మల్, 3 నవంబర్ (హి.స.)

నిర్మల్ జిల్లాలో సోయాబీన్

కొనుగోలు ప్రక్రియ సజావుగా కొనసాగుతోందని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. సోమవారం ఆమె మాట్లాడుతూ రైతులకు ఉదయం 6 గంటల టోకెన్లు జారీ చేయడం ప్రారంభమైందని, అన్ని కొనుగోలు కేంద్రాల్లో ఎటువంటి అంతరాయం లేకుండా కార్యక్రమం కొనసాగుతున్నదని వివరించారు. ప్రస్తుతం జిల్లాలో ఏఎంసీ ముధోల్, బోరేగావ్ (ముధోల్ మండలం), బాసర ఈ మూడు కేంద్రాల ద్వారా ఇప్పటి వరకు 1,400 మందికి పైగా రైతులకు టోకెన్లు జారీ చేసినట్లు తెలిపారు.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande