చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రిలో అరణ్య రోదన.. బస్సు ప్రమాదంలో 22 కి చేరిన మృతుల సంఖ్య
హైదరాబాద్, 3 నవంబర్ (హి.స.) రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగిన విషయం విదితమే. తాండూరు డిపోనకు చెందిన ఆర్టీసీ బస్సును కంకర లోడుతో వెళ్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య 215 చేరింది. పలువురికి తీవ్రంగా గాయపడ్డారు. మృతుల సంఖ
బస్సు ప్రమా


హైదరాబాద్, 3 నవంబర్ (హి.స.)

రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు

ప్రమాదం జరిగిన విషయం విదితమే. తాండూరు డిపోనకు చెందిన ఆర్టీసీ బస్సును కంకర లోడుతో వెళ్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య 215 చేరింది. పలువురికి తీవ్రంగా గాయపడ్డారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. చేవెళ్ల మండలం మీర్జాగూడ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. బస్సుపై కంకర లోడు పడిపోవడంతో పలువురు ప్రయాణికులు అందులో కూరుకుపోయారు. పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని మూడు జేసీబీల సాయంతో సహాయక చర్యలు చేపడుతున్నారు. కంకరలో కూరుకుపోయిన వారిని ఒక్కొక్కరిగా బయటకు తీస్తున్నారు. కాగా, ప్రమాదంపై తాజాగా సీఎం రేవంత్రెడ్డి స్పందించారు. గాయపడిన వారిని హైదరాబాద్కు తరలించి మెరుగైన వైద్యం అందించాలని సీఎస్, డీజీపీలను ఆదేశించారు. అందుబాటులో ఉన్న మంత్రులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకోవాలని సూచించారు. అత్యవసర వైద్య సాయంతో పాటు అంబులెన్సులు, వైద్య సిబ్బందిని రంగంలోకి దించాలని సీఎం ఆదేశించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande