
హైదరాబాద్, 3 నవంబర్ (హి.స.)
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం
మీర్జాగూడ వద్ద జరిగిన ఆర్టీసీ బస్సు ప్రమాదంపై తెలంగాణ మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్, స్పీకర్ గడ్డం ప్రసాద్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. ప్రమాద ఘటనకు సంబంధించిన వివరాలను మంత్రి పొన్నం అధికారులతో ఫోన్ లో మాట్లాడి తెలుసుకున్నారు. జిల్లా అధికారులు, కలెక్టర్ వెంటనే ఘటనా స్థలానికి సహాయకచర్యలు వెళ్లాలని ముమ్మరం ఆదేశించారు. చేయాలని, గాయపడినవారికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశాలు జారీ చేశారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు.
ఖానాపూర్ స్టేజీ వద్ద ఆర్టీసీ బస్సు టిప్పర్ ఢీకొని జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం తనను తీవ్ర ద్రిగ్బాంతికి గురిచేసిందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ ఎక్స్ లో పేర్కొన్నారు. మరణించిన వారిలో చిన్నపిల్లలు, మహిళలు ప్రాణాలు కోల్పోవడం చాల బాధాకరమని, ప్రమాదంలో గాయపడిన ప్రయాణికులకు మెరుగైన వైద్య సదుపాయం అందించాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్, పోలీస్ అధికారులను ఆదేశించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..