రైతుల శ్రేయస్సే ప్రభుత్వ ధ్యేయం : ఎమ్మెల్యే లక్ష్మీ కాంతారావు
కామారెడ్డి, 3 నవంబర్ (హి.స.) రైతుల శ్రేయస్సే ప్రభుత్వ ధ్యేయం అని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు అన్నారు. చిల్లర్గి సహకార సంఘం ఆధ్వర్యంలో సోమవారం నాడు సోయా కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి ఆయన మాట్లాడారు. రైతులు పండించిన ప్రతి ధాన్యాన
ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు


కామారెడ్డి, 3 నవంబర్ (హి.స.)

రైతుల శ్రేయస్సే ప్రభుత్వ ధ్యేయం అని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు అన్నారు. చిల్లర్గి సహకార సంఘం ఆధ్వర్యంలో సోమవారం నాడు సోయా కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి ఆయన మాట్లాడారు. రైతులు పండించిన ప్రతి ధాన్యాన్ని కొనుగోలు చేసే విధంగానే కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వం ప్రారంభిస్తుందని, దీనిని రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రభుత్వం సోయా పంటకు క్వింటాల్ కు 538 రూపాయలు ధర కేటాయించిందని ఆయన తెలిపారు. రైతులందరూ దళారులను నమ్మి నష్టపోకుండా ఉండేందుకే ప్రభుత్వం నాణ్యమైన ధర నిర్ణయించి కొనుగోలు చేస్తుందని ఆయన తెలిపారు. ఈ ---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande