కాంగ్రెస్ పాలనలో రైతులు సంతోషంగా లేరు: సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్
సంగారెడ్డి, 3 నవంబర్ (హి.స.) కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో రైతులకు అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని, ఏ ఒక్క రైతు కూడా సంతోషంగా లేడని, రైతుల ఇబ్బందులు వర్ణనాతీతమని సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ అన్నారు. సోమవారం సంగారెడ్డి మండల పరిధిలోని ఇస్మాయిల్
సంగారెడ్డి ఎమ్మెల్యే


సంగారెడ్డి, 3 నవంబర్ (హి.స.)

కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో రైతులకు అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని, ఏ ఒక్క రైతు కూడా సంతోషంగా లేడని, రైతుల ఇబ్బందులు వర్ణనాతీతమని సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ అన్నారు. సోమవారం సంగారెడ్డి మండల పరిధిలోని ఇస్మాయిల్ ఖాన్ పేట్ వ్యవసాయ మార్కెట్ యార్డ్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే చింత ప్రభాకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత బిఆర్ఎస్ పాలనలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదని, పండించిన ప్రతి గింజను కొనుగోలు చేసి వెంట వెంటనే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేశారని, కానీ నేడు తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను అనేక ఇబ్బందులకు గురి చేస్తుందన్నారు.

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande