
ఆసిఫాబాద్, 3 నవంబర్ (హి.స.)
పేకాట స్థావరాల పై దాడి చేసి 5
గురు పేకాట రాయుళ్లను పట్టుకుని కేసు నమోదు చేసినట్లు ఆసిఫాబాద్ జిల్లా టాస్క్ ఫోర్స్ సీఐ రాణా ప్రతాప్ తెలిపారు. జిల్లాలోని దహేగాం మండలం బీబ్రా గ్రామ శివారులో పేకాట ఆడుతున్నట్టు వచ్చిన విశ్వసనీయ సమాచారం మేరకు ఆదివారం రాత్రి పేకాట శిబిరంపై దాడిచేసి పేకాట ఆడుతున్న 5 గురిని పట్టుకున్నారు. వారి వద్ద నుంచి 5 వేల 960 రూపాయలు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు