పత్తి రైతుల గోస ప్రభుత్వాలకు పట్టదా..? జాగృతి కవిత
ఆదిలాబాద్, 3 నవంబర్ (హి.స.) ఆదిలాబాద్ జిల్లాలో పత్తి రైతులు గోసపడుతున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడంలేదని, ఇక్కడున్న బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యేలు కూడా విఫలమయ్యారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. జాగృతి జనంబాటలో భాగం
జాగృతి కవిత


ఆదిలాబాద్, 3 నవంబర్ (హి.స.)

ఆదిలాబాద్ జిల్లాలో పత్తి రైతులు

గోసపడుతున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడంలేదని, ఇక్కడున్న బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యేలు కూడా విఫలమయ్యారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. జాగృతి జనంబాటలో భాగంగా సోమవారం ఆదిలాబాద్ జిల్లాలో ఆమె పర్యటించారు. ఈ సందర్భంగా ఆదిలాబాద్ పత్తి మార్కెట్ యార్డులో రైతులతో కవిత మాట్లాడారు.. వర్షాలతో పత్తి పంట తీవ్రంగా దెబ్బతిన్నదని ఇటు మద్దతు ధర కూడా లేక ఇబ్బందులు పడుతున్నామని రైతులు ఆమెకు వెలిబుచ్చారు. పత్తిలో తేమశాతం పేరుతో కొనుగోలు చేయకుండా రైతులను ఇబ్బందులు పెట్టడం సరికాదన్నారు.

20 శాతం తేమ మించి ఉన్న కొనుగోలు చేసేందుకు సీసీఐ ముందుకు రావాలన్నారు. ఇక్కడ బిజెపి ఎంపీ, ఎమ్మెల్యేలున్న కనీసం కేంద్ర మంత్రులతో మాట్లాడి రైతులకు మద్దతు ధర కల్పించేలా కృషి చేయడంలో విఫలమయ్యారని విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ ఎన్నికలు పక్కనపెట్టి రైతు సమస్యలపై దృష్టి సారించాలన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande