
జోగులాంబ గద్వాల, 3 నవంబర్ (హి.స.)
ఆరుగాలం కష్టపడి పండించిన పత్తి
పంట ను పూర్తి స్థాయిలో కొనుగోలు చేయాలని జోగులాంబ గద్వాల జిల్లాలోని ఉండవల్లి గ్రామానికి చెందిన పత్తి రైతులు 44వ జాతీయ రహదారిపై సోమవారం ఆందోళన చేపట్టారు. అకాల వర్షాల కారణంతో పత్తి కొనుగోలు చేయకుండా రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని రైతులు వాపోతున్నారు. అకాల తుఫాను వర్షాల కారణంగా పంట దిగుబడే నామమాత్రంగా వచ్చిన నిబంధనల పేరుతో పత్తి రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రహదారిపై రైతులు ధర్నాతో నాలుగు కిలోమీటర్ల వరకు భారీగా ట్రాఫిక్ జామ్ అయింది.
అలంపూర్ సీఐ రవిబాబు ఎస్సై శేఖర్ తన సిబ్బందితో రైతులు చేస్తున్న ధర్నా ప్రదేశానికి చేరుకొని రైతులతో మాట్లాడి తాత్కాలికంగా ధర్నాను వినిపింపజేసి ట్రాఫిక్ ను పునరుద్ధరించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు