
సంగారెడ్డి, 3 నవంబర్ (హి.స.)
ఉమ్మడి మెదక్ జిల్లాలో మునిపల్లి మండలం తాటిపల్లి వైన్స్ కు టెండర్లు తక్కువగా వచ్చాయన్న కారణంతో నిలిపివేసిన ఒక్క వైన్ షాప్ కు ఈ రోజు అధికారులు డ్రా తీశారు. సంగారెడ్డి జిల్లా కేంద్రంలో గల స్థానిక కలెక్టర్ ఆడిటోరియంలో గెజిట్ షాప్ నెంబర్ 24 తాటిపల్లి సంబంధించి గతంలో 19 దరఖాస్తులు రాగా ఈ షాప్ కి మళ్ళీ టెండర్ల ప్రక్రియ నిర్వహించి 97 దరఖాస్తులు రావడంతో జిల్లా కలెక్టర్ ప్రావీణ్య ఆధ్వర్యంలో లక్కీ డ్రాను తీశారు. ఇందులో 57వ టోకెన్ నంబర్ అయిన గౌండ్ల వెంకటేశం అనే వ్యక్తికి షాపును దక్కించుకున్నాడు. అయితే జిల్లాలో మొత్తం దరఖాస్తుల ద్వారా 135 కోట్లు ఆదాయం వచ్చిందని కలెక్టర్ తెలిపారు. షాప్ దక్కించుకున్న వారి నుంచి లైసెన్స్ ఫీ రూపేణ 11.6 కోట్లు ఆదాయం ఎక్సైజ్ శాఖకు సమకూరినట్లు వివరించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు