యలమంచిలిలో రోడ్డు ప్రమాదం.. మానవత్వం చాటుకున్న ఏపీ హోం మంత్రి అనిత
అనకాపల్లి, 3 నవంబర్ (హి.స.)ఆంధ్రప్రదేశ్‌ హోం మంత్రి వంగలపూడి అనిత (Vangalapudi Anita) మానవత్వానికి నిదర్శనంగా నిలిచారు. ఓ కార్యక్రమం నిమిత్తం అధికారులతో కలిసి వెళ్తున్న ఆమె.. అనకాపల్లి జిల్లా యలమంచిలి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదం చూసి క్షణం ఆలస్యం
ap-home-minister-anitha-shows-humanity-490340


అనకాపల్లి, 3 నవంబర్ (హి.స.)ఆంధ్రప్రదేశ్‌ హోం మంత్రి వంగలపూడి అనిత (Vangalapudi Anita) మానవత్వానికి నిదర్శనంగా నిలిచారు. ఓ కార్యక్రమం నిమిత్తం అధికారులతో కలిసి వెళ్తున్న ఆమె.. అనకాపల్లి జిల్లా యలమంచిలి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదం చూసి క్షణం ఆలస్యం చేయకుండా సహాయానికి ముందుకొచ్చారు. ప్రమాదంలో పలువురు తీవ్రంగా గాయపడగా, హోం మంత్రి స్వయంగా తమ వాహనాన్ని ఆపి, క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. బాధితుల ప్రాణాలను కాపాడటంలో ఆమె చూపిన తక్షణ స్పందన స్థానికుల హృదయాలను తాకింది. ఆ తర్వాత మంత్రి వంగలపూడి అనిత యలమంచిలి ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి గాయపడిన వారిని పరామర్శించారు. వైద్యుల నుంచి చికిత్స వివరాలను తెలుసుకొని, వారికి అత్యుత్తమ వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. ప్రమాదంలో గాయపడిన వారి పట్ల చూపిన మానవతా హృదయం ప్రజల ప్రశంసలు అందుకుంటుంది. ------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande