'ఆ విమానాల్లో సాఫ్ట్వేర్ సమస్య పరిష్కారమైంది'..డీజీసీఏ
హైదరాబాద్, 30 నవంబర్ (హి.స.) ఎయిర్బస్ ఏ320 విమానాల్లో సాఫ్ట్వేర్ సమస్య ను పరిష్కరించినట్లు డీజీసీఏ ఆదివారం వెల్లడించింది. మొత్తం 323 విమానాల్లో సాఫ్ట్వేరను అప్డేట్ చేసినట్లు తెలిపింది. భారత్ ఎయిర్బస్కు చెందిన ఏ320 రకం విమానాలు 338 వినియోగిస్తోంద
డి సి జీ ఏ


హైదరాబాద్, 30 నవంబర్ (హి.స.)

ఎయిర్బస్ ఏ320 విమానాల్లో సాఫ్ట్వేర్ సమస్య ను పరిష్కరించినట్లు డీజీసీఏ ఆదివారం వెల్లడించింది. మొత్తం 323 విమానాల్లో సాఫ్ట్వేరను అప్డేట్ చేసినట్లు తెలిపింది. భారత్ ఎయిర్బస్కు చెందిన ఏ320 రకం విమానాలు 338 వినియోగిస్తోంది.

ఇవి ప్రధానంగా ఇండిగో, ఎయిరిండియా, ఇండియా ఎక్స్ప్రెస్ వద్ద ఉన్నాయి. వీటిల్లో 323 మాత్రమే ప్రస్తుతం విధుల్లో ఉండగా.. ఆరు మెయింటెనెన్స్లో ఉన్నాయి. మరో తొమ్మిది విమానాలకు ఎటువంటి అప్గ్రేడ్ అవసరంలేదని అధికారులు తెలిపారు. సూర్యుడి వేడి కారణంగా ఎయిర్బస్ ఏ320 విమానాల్లో సాఫ్ట్వేర్ వ్యవస్థలు దెబ్బతింటున్నాయి.

ఫలితంగా సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. ఇటీవల ఎయిర్బస్కు చెందిన జెట్ బ్లూ ఏ320 అనే విమానానికి ఇలాంటి పరిస్థితే ఎదురైంది. దాంతో ఈ సాఫ్ట్వేర్లో మార్పులు చేసుకోవాలని ఎయిర్బస్ కీలక హెచ్చరికలు జారీచేసింది. సాఫ్ట్వేర్ దెబ్బతినడానికి తీవ్రమైన సోలార్ రేడియేషన్ కారణమని అధికారులు తేల్చారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande