
హైదరాబాద్, 30 నవంబర్ (హి.స.)
వరంగల్ - హైదరాబాద్ జాతీయ
రహదారి (163) పై రూ.150 కోట్లతో నిర్మించ తలపెట్టిన ఫ్లైఓవర్ వంతెనలు, అండర్ పాస్ లతో పాటు ఘట్కేసర్ పరిధిలో ఘట్టమైసమ్మ అండర్ పాస్ నిర్మాణం పనులు సంవత్సరంలోపు పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామని మల్కాజిరి ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. ఆదివారం ఎంపీ ఈటల, మేడ్చల్ నియోజకవర్గం ఎమ్మెల్ మల్లారెడ్డితో కలిసి ఘట్కేసర్ మున్సిపాలిటీ పరిధిలో 163 జాతీయ రహదారి పై నిర్మిస్తున్న ఫ్లైఓవర్, అండర్పాస్ నిర్మాణ పనులను పరిశీలించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.... ఘట్టమైసమ్మ కాలనీతోపాటు, ప్రభుత్వ హాస్టల్లు, విద్యాలయాలు కాలనీలో చేరుకోవడానికి గట్టుమైసమ్మ అండర్పాస్ నిర్మాణాన్ని తప్పకుండా నిర్మించేలా ఆదేశాలు జారీ చేస్తామని హామీ ఇచ్చారు.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..