ఘోర బస్సు ప్రమాదం.. ఇద్దరు మృతి, పలువురికి గాయాలు
ఆదిలాబాద్, 30 నవంబర్ (హి.స.) ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలంలోని బోథ్ ఎక్స్ రోడ్ వద్ద ఆదివారం తెల్లవారుజామున ఘోర బస్సు ప్రమాదం చోటుచేసుకుంది. ఆదిలాబాద్ వైపు ప్రయాణికులతో వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు, లారీ బోథ్ ఎక్స్ రోడ్ సమీపంలో ఢీకొన్నా
బస్సు ప్రమాదం


ఆదిలాబాద్, 30 నవంబర్ (హి.స.)

ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలంలోని బోథ్ ఎక్స్ రోడ్ వద్ద ఆదివారం తెల్లవారుజామున ఘోర బస్సు ప్రమాదం చోటుచేసుకుంది. ఆదిలాబాద్ వైపు ప్రయాణికులతో వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు, లారీ బోథ్ ఎక్స్ రోడ్ సమీపంలో ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు ప్రయాణికులు చనిపోయినట్లు, మరి కొంతమంది ప్రయాణికులకు తీవ్ర గాయాలు అయినట్లు స్థానికులు తెలిపారు. జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరగడంతో కిలోమీటర్ మేర ట్రాఫిక్ జామ్ అయినట్లు సమాచారం. గాయపడ్డ వారిని హుటాహుటిన స్థానికులు, పోలీసులు కలిసి ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రికి క్షతగాత్రులను తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande