భద్రాద్రి జిల్లాలో భారీగా గంజాయి పట్టివేత
భద్రాద్రి కొత్తగూడెం, 30 నవంబర్ (హి.స.) భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారీగా గంజాయి పట్టుబడింది. టేకులపల్లి మండలంలోని సాయన్నపేట క్రాస్ రోడ్డు సమీపంలో మూల మలుపు వద్ద వాహనాల తనిఖీలు చేస్తుండగా టేకులపల్లి పోలిసులు రూ.99లక్షల 83వేల గల 199.673కేజీల గం
గంజాయ


భద్రాద్రి కొత్తగూడెం, 30 నవంబర్ (హి.స.)

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారీగా గంజాయి పట్టుబడింది. టేకులపల్లి మండలంలోని సాయన్నపేట క్రాస్ రోడ్డు సమీపంలో మూల మలుపు వద్ద వాహనాల తనిఖీలు చేస్తుండగా టేకులపల్లి పోలిసులు రూ.99లక్షల 83వేల గల 199.673కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ప్యాకెట్ల రూపంలో కారు డిక్కీలో పెట్టి తరలిస్తుండగా పట్టుకున్నారు. ఇల్లందు డీఎస్పీ చంద్రభాను తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.

ఆంధ్ర - ఒడిషా బార్డర్ నుండి ఒట్టేటప్పుడు కాకుండా గంజాయిని రాజస్థాన్కు తరలిస్తుండగా శనివారం రాత్రి టేకులపల్లి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. లాల్ సింగ్ చౌహన్ అనే వ్యక్తిని అదుపులో తీసుకొని కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలిస్తున్నామని తెలిపారు. లాల్ సింగ్ చౌహన్ పై ఇదివరకు మూడు కేసులు ఉన్నాయని తెలిపారు.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande