
హైదరాబాద్, 30 నవంబర్ (హి.స.)
యూకే (UK) లో భారత్కు చెందిన
విద్యార్థి దారుణ హత్యకు గురయ్యాడు. వోర్టర్ ప్రాంతంలో నవంబర్ 25న ఈ ఘటన జరిగింది. హర్యానాకు చెందిన విజయ్ కుమార్ షియోరాన్ (30) అనే యువకుడిపై గుర్తుతెలియని దుండగులు కత్తులతో దాడి చేశారు. వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతిచెందాడు.
ఈ కేసులో పోలీసులు ఐదుగురు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని చెప్పారు. హర్యానాకు చెందిన విజయ్ కుమార్ షియోరాన్ ఈ ఏడాది ప్రారంభంలో ఉన్నత చదువుల కోసం యూకేకు వెళ్లినట్లు కుటుంబసభ్యులు తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..