శరవేగంగా పనులు పూర్తి చేసుకుంటున్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం
అమరావతి, 30 నవంబర్ (హి.స.)శరవేగంగా నిర్మాణ పనులు పూర్తి చేసుకుంటున్నo భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం టెస్ట్‌ ఫ్లైట్‌కు సిద్ధమైంది. డిసెంబరు చివరి వారం లేక జనవరి తొలి వారంలో ఈ ఎయిర్‌పోర్టు నుంచి తొలి విమానం ఎగరనుంది. ఇప్పటివరకూ 92 శాతం నిర్మాణ పనుల
శరవేగంగా పనులు పూర్తి చేసుకుంటున్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం


అమరావతి, 30 నవంబర్ (హి.స.)శరవేగంగా నిర్మాణ పనులు పూర్తి చేసుకుంటున్నo భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం టెస్ట్‌ ఫ్లైట్‌కు సిద్ధమైంది. డిసెంబరు చివరి వారం లేక జనవరి తొలి వారంలో ఈ ఎయిర్‌పోర్టు నుంచి తొలి విమానం ఎగరనుంది. ఇప్పటివరకూ 92 శాతం నిర్మాణ పనులు పూర్తయ్యాయి. మిగతా పనులు కూడా జూన్‌ నాటికి పూర్తిచేసి తాత్కాలికంగా విమాన రాకపోకలను ప్రారంభించేలా కేంద్ర పౌర విమానయాన శాఖ సన్నాహాలు చేస్తోంది. గడువుకు ముందే పనులు పూర్తి చేయాలని పట్టుదలతో ఉంది. విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు ఎయిర్‌పోర్టు పనులను కనీసం 15 రోజులకు ఒకసారైనా పర్యవేక్షిస్తున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande