
తిరుపతి, 30 నవంబర్ (హి.స.) తెలుగు రాష్ట్రాల్లో సంచలనం
సృష్టించిన ఐ బొమ్మ రవిపై పీపీఐ నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఆయన తిరుపతిలో మీడియాతో మాట్లాడారు. ఐబొమ్మలో నేను సినిమాలు ఫ్రీగా చూశానని హాట్ కామెంట్స్ చేశారు. ఆరేడు వందలు పెట్టి సినిమాలు ఎలా చూసేది అని చెప్పుకొచ్చారు. ఒకరు మంచి చేస్తే మరొకరు చెడు చేస్తారు అని అన్నారు. అద్భుతమైన తెలివితేటలు ఉన్న రవి అలా మారడానికి కారణం ఈ వ్యవస్థలే అని అసంతృప్తి వ్యక్తం చేశారు. వ్యవస్థలో లోపాలు సరి చేయకుండా ఉంటే ఇలాంటి రవిలే పుట్టుకు వస్తారని, ఒక హిడ్మాను చంపితే వెయ్యి మంది హిడ్మాలు పుడతారని సీపీఐ నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఒక బొమ్మ రవిని చంపితేనో, జైల్లో వేస్తేనో మరో 100 మంది వస్తారని తెలిపారు. ఐ బొమ్మ రవి ని ఉరి వేస్తే ఎలాంటి ప్రయోజనం ఉండదని, సినిమా మాఫియాను ఉరి తీస్తే సమాజానికి ఉపయోగం ఉంటుందన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..