
అమరావతి, 30 నవంబర్ (హి.స.)
తెలుగు రాష్ట్రాల్లో చలికాలం ఎఫెక్ట్ స్పష్టంగా కనిపిస్తోంది. ఉష్ణోగ్రతలు పడిపోవడంతో నాన్‌వెజ్ డిమాండ్ పెరిగి చికెన్ ధరలు స్వల్పంగా పెరిగాయి. ఆదివారం హైదరాబాద్‌లో స్కిన్‌లెస్ చికెన్ కిలో ధర రూ.250 నుంచి రూ.280 వరకు నమోదవుతున్నది. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లో కూడా పరిస్థితి ఇలానే ఉండగా అక్కడ ధర రూ.240 నుంచి రూ.270 వరకు ఉంది.
మటన్ ధరలు ఇప్పటికే గరిష్ట స్థాయిలోనే ఉండగా, మార్కెట్లో రూ.900 పైగా విక్రయించబడుతోంది. గుడ్డు ధర కూడా రూ.7 నుంచి రూ.8 వరకు పలుకుతోంది. చలికాలం కొనసాగుతున్నందున రాబోయే రోజుల్లో డిమాండ్ మరింత పెరిగే అవకాశం ఉండడంతో ధరలు ఇంకాస్త పెరిగే అవకాశం ఉందని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి.
ఇక కోడి గుడ్డు విషయానికొస్తే ఒక్కొక్కటి ధర రూ. 7.50 నుంచి రూ.8 వరకు పలుకుతుంది. కూరగాయల ధరలు అధికంగా ఉన్నప్పుడు కోడిగుడ్లతో సరిపెట్టుకునే మిడిల్ క్లాస్ ఫ్యామిలీలకు ఇవి కూడా ఇప్పుడు భారం మారాయి. వచ్చే రెండు, మూడు వారాల్లో డజను గుడ్లు సెంచరీ కొట్టే అవకాశం కూడా ఉంది. ప్రతీ ఏడాదిలాగే కార్తీక మాసం ముగిసి నవంబర్ 21 నుంచి మార్గశిర మాసం మొదలుకావడంతో కోడి గుడ్డు, చికెన్ ధరలు పెరుగుతున్నాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV