కొండగట్టు.స్టేజి వద్ద శనివారం రాత్రి 11 గంటలకు భారీ.అగ్నిప్రమాదం
ధర్మపురి 30 నవంబర్ (హి.స.) కొండగట్టు స్టేజీ వద్ద శనివారం రాత్రి 11 గంటల ప్రాంతంలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. స్థానిక అభయ హనుమాన్‌ విగ్రహం నుంచి కరీంనగర్‌-జగిత్యాల ప్రధాన రహదారి వరకు దాదాపు 32 బొమ్మల దుకాణాలకు నిప్పంటుకొని సామగ్రి కాలి బూడిదై
కొండగట్టు.స్టేజి వద్ద  శనివారం రాత్రి 11 గంటలకు భారీ.అగ్నిప్రమాదం


ధర్మపురి 30 నవంబర్ (హి.స.) కొండగట్టు స్టేజీ వద్ద శనివారం రాత్రి 11 గంటల ప్రాంతంలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. స్థానిక అభయ హనుమాన్‌ విగ్రహం నుంచి కరీంనగర్‌-జగిత్యాల ప్రధాన రహదారి వరకు దాదాపు 32 బొమ్మల దుకాణాలకు నిప్పంటుకొని సామగ్రి కాలి బూడిదైంది. సమ్మక్క సారలమ్మ జాతరను పురస్కరించుకొని వ్యాపారులు భారీ మొత్తంలో బొమ్మలు కొనుగోలు చేసి నిల్వ చేసుకున్నారు. ఒక్కో దుకాణంలో రూ.8 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు విలువైన బొమ్మలుంటాయి. ఈ ప్రమాదంలో రూ.కోట్లలో ఆస్తి నష్టం జరిగినట్లు అంచనా వేస్తున్నారు. ఘటనా స్థలం వద్ద వ్యాపారుల రోదనలు మిన్నంటాయి. 12 గం.ల ప్రాంతంలో అగ్నిమాపక సిబ్బంది రాగా అప్పటికే దుకాణాలు పూర్తిగా కాలిపోయాయి. మల్యాల, ధర్మపురి సీఐలు రవి, రాంనర్సింహారెడ్డి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ప్రమాదానికి విద్యుత్తు షార్ట్‌ సర్క్యూట్‌ కారణమని తెలిసింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande