
జగిత్యాల, 30 నవంబర్ (హి.స.)
విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో బొమ్మల
దుకాణాలు దగ్ధమైన సంఘటన జగిత్యాల జిల్లా కొండగట్టులో గత అర్ధరాత్రి ప్రాంతంలో చోటుచేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో మంటలు చెలరేగి సుమారుగా 30 బొమ్మల దుకాణాలు దగ్ధమయ్యాయి. సుమారు కోటి రూపాయల ఆస్తి నష్టం వాటిల్లిందని బాధితులు వాపోయారు. ఎప్పటిలాగే శనివారం రాత్రి దుకాణాలు మూసివేసి పడుకున్నారు. ఒక్కసారిగా మంటలు చెలరేగి వేగంగా వ్యాపించాయి.
ప్లాస్టిక్ బొమ్మలు కావడంతో మంటలు భారీగా ఎగిసిపడ్డాయి.
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు