
హైదరాబాద్, 30 నవంబర్ (హి.స.)
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
రేపటి నుంచి జిల్లాలో పర్యటించనున్న సంగతి తెలిసిందే. అయితే సర్పంచ్ ఎన్నికల నోటిఫికేషన్ కొనసాగుతున్న క్రమంలో సీఎం జిల్లాల పర్యటనపై 'జాగృతి' అధ్యక్షురాలు కవిత తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆమె ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ముఖ్యమంత్రి చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపన పర్యటనలు ఎన్నికల ప్రచారమేనని, ఇందుకోసం ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేస్తున్నారని 'జాగృతి' అధ్యక్షురాలు కవిత తన ట్వీట్లో ఆరోపించారు.
ఎన్నికలు గ్రామాల్లో జరగనున్న క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి ఆ జిల్లా కేంద్రాలకు వెళ్లి అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేయడాన్ని కవిత తీవ్రంగా తప్పుబట్టారు.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..