పార్టీ కోసం పనిచేసిన వారికే ప్రాధాన్యత : మంత్రి పొన్నం
రాజన్న సిరిసిల్ల, 30 నవంబర్ (హి.స.) కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడ్డ వారికి ప్రాధాన్యత ఉంటుందని, స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు సత్తా చాటాలని రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. ఆదివారం డిసిసి నూత
మంత్రి పొన్నం


రాజన్న సిరిసిల్ల, 30 నవంబర్ (హి.స.)

కాంగ్రెస్ పార్టీ కోసం

కష్టపడ్డ వారికి ప్రాధాన్యత ఉంటుందని, స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు సత్తా చాటాలని రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. ఆదివారం డిసిసి నూతన జిల్లా అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మాజీ రాజ్యసభ సభ్యులు హనుమంతరావు, ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ లతో కలిసి ఆయన ముఖ్య అతిథిగా హాజరై నూతన అధ్యక్షుని చేత ప్రమాణ స్వీకారం చేయించారు. అంతకుముందు పట్టణంలోని పాత బస్టాండ్ నుంచి భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. జిల్లాకు వచ్చిన మంత్రికి కాంగ్రెస్ నేతలు గజమాలతో ఘనస్వాగతం పలికారు.

అనంతరం పట్టణంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. గ్రామపంచాయతీ ఎన్నికల్లో జిల్లాపై కాంగ్రెస్ జెండా ఎగరాలని స్పష్టం చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande