మొదలైన మేడారం జాతర సందడి.. ముందస్తు మొక్కుల కోసం బారులు తీరిన భక్తులు
ములుగు, 30 నవంబర్ (హి.స.) జనవరిలో జరిగే మహా మేడారం జాతరను పురస్కరించుకుని ముందస్తు మొక్కులు చెల్లించడానికి భక్తులు బారులు తీరుతున్నారు. ఆదివారం సెలవు రోజు కావడంతో భక్తులు తండోపతండాలుగా చేరుకొని అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకున్నారు. ఆదివారం దాదాప
మేడారం జాతర


ములుగు, 30 నవంబర్ (హి.స.)

జనవరిలో జరిగే మహా మేడారం జాతరను పురస్కరించుకుని ముందస్తు మొక్కులు చెల్లించడానికి భక్తులు బారులు తీరుతున్నారు. ఆదివారం సెలవు రోజు కావడంతో భక్తులు తండోపతండాలుగా చేరుకొని అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకున్నారు. ఆదివారం దాదాపు 50 వేల మంది భక్తులు అమ్మవార్లను దర్శించుకోవడానికి వచ్చారని అధికారులు తెలిపారు. ఒకవైపు గద్దెల పునరుద్ధరణ పనులు జరుగుతుండగా మరోవైపు భక్తుల సందడి నెలకొనడం హడావుడి గా కనిపించింది. అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు కుటుంబ సభ్యులతో కలిసి అటవీ ప్రాంతంలో విందు భోజనాలు ఆరగించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande