
సత్తెనపల్లి, 30 నవంబర్ (హి.స.)
: పల్నాడు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. సత్తెనపల్లి మండలం ధూళిపాళ్లలో తల్లి, కుమారుడిపై దుండగులు దాడికి పాల్పడ్డారు. ఇంట్లోకి చొరబడి సాంబశివరావు(36)ను నరికి చంపారు. దుండగుల దాడిలో ఆయన తల్లి కృష్ణకుమారి(55)కి తీవ్ర గాయాలయ్యాయి. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. దాడి చేసిన దుండగులు పారిపోతుండగా.. చాగల్లు వద్ద గ్రామస్థులు వారిని పట్టుకున్నారు.ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ