
జడ్చర్ల, 30 నవంబర్ (హి.స.)
తెలంగాణకు అసలైన విలన్లు కేసీఆర్,
కేటీఆర్, హరీశ్ రావులే అని నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి అన్నారు. తెలంగాణ విలన్ కాంగ్రెస్ అనే ముందు ఒకటికి పది సార్లు ఆలోచన చేయాలని మనం ఏం మాట్లాడినా ప్రజలు అన్ని గమనిస్తూనే ఉంటారని తెలిపారు. ఆదివారం జడ్చర్ల పట్టణంలోని తన అనుచరులతో కలిసి ఎంపీ రవి స్థానిక మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రానికి అసలైన విలన్లు కాంగ్రెస్సే అని కేటీఆర్ అనడం హాస్యాస్పదమన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు