
న్యూఢిల్లీ, 30 నవంబర్ (హి.స.)
భారత పార్లమెంట్ శీతాకాల సమావేశాలు డిసెంబర్ 1 నుంచి ప్రారంభమవ్వనున్నాయి. ఈ నేపథ్యంలో ఈ రోజు అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో 36 పార్టీలకు చెందిన 50 మంది నేతలు హాజరయ్యారు. ఈ ఆల్ పార్టీ మీటింగ్ ముగిసిన తర్వాత పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు (Minister Kiren Rijiju) ప్రతిపక్షాలకు కీలక విజ్ఞప్తి చేశారు. పార్లమెంట్ సజావుగా పనిచేయడానికి అందరూ సహకరించాలని ఆయన కోరారు. పార్లమెంట్ పని చేయకుండా అడ్డుకుంటామని ఎవరూ అనలేదని.. కొంతమంది నాయకులు 'SIR' (ప్రత్యేక సమగ్ర సవరణ) అంశంపై సభలో గందరగోళం సృష్టించే అవకాశం ఉందని చెప్పారు, ఈ దృక్పథంతోనే చూస్తున్నానని, ప్రతిపక్షం లేవనెత్తే అంశాన్ని వినడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి స్పష్టం చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..