ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫార్మసీ.కౌన్సిల్ కు ఎట్టకేలకు.ఎన్నికలు జరగబోతున్నాయి
అమరావతి, 30 నవంబర్ (హి.స.)ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఫార్మసీ కౌన్సిల్‌కు ఎట్టకేలకు ఎన్నికలు జరగబోతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లక్ష మంది ఫార్మసిస్టులు ఈ ఎన్నికల కోసం 15 ఏళ్ల నుంచి ఎదురుచూస్తున్నారు. కోర్టు కేసులు, కొంత మంది చేసిన రాజకీయాల కారణంగా రా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫార్మసీ.కౌన్సిల్ కు ఎట్టకేలకు.ఎన్నికలు జరగబోతున్నాయి


అమరావతి, 30 నవంబర్ (హి.స.)ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఫార్మసీ కౌన్సిల్‌కు ఎట్టకేలకు ఎన్నికలు జరగబోతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లక్ష మంది ఫార్మసిస్టులు ఈ ఎన్నికల కోసం 15 ఏళ్ల నుంచి ఎదురుచూస్తున్నారు. కోర్టు కేసులు, కొంత మంది చేసిన రాజకీయాల కారణంగా రాష్ట్ర విభజన తర్వాతి నుంచి ఫార్మసీ కౌన్సిల్‌కు ఎన్నికలు నిలిచిపోయాయి. వైసీపీ ప్రభుత్వం అండతో కొంత మంది తమ స్వార్థం కోసం ఫార్మసీ కౌన్సిల్‌ ఎన్నికలకు అడ్డుపడుతూ వచ్చారు. ప్రభుత్వ ఫార్మసిస్టు అసోసియేషన్‌, మరికొన్ని అసోసియేషన్ల సుదీర్ఘ పోరాటం తర్వాత ఫార్మసీ కౌన్సిల్‌ ఎన్నికలకు ప్రభు త్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగే ఎన్నికల్లో 60 వేల మంది ఫార్మసిస్టులు పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా వారి ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. డిసెంబరు 4వ తేదీ నుంచి ఓటర్లకు పోస్టల్‌ బ్యాలెట్‌ పత్రాలు రిజిస్ట్రర్‌ పోస్టు ద్వారా పంపిస్తారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande