
హైదరాబాద్, 30 నవంబర్ (హి.స.) ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ
128వ 'మన్ కీ బాత్' కార్యక్రమంలో తెలంగాణకు చెందిన కరీంనగర్, హైదరాబాద్ నగరాలను ప్రత్యేకంగా ప్రస్తావించారు. దేశ అభివృద్ధి అన్ని రంగాల్లో సమానంగా సాధించినప్పుడే సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్నారు.
ఇటీవల జీ-20 సదస్సులో విదేశీ అతిథులకు అందించిన బహుమతుల వివరాలను వెల్లడించిన ప్రధాని మోదీ, వాటిలో కరీంనగర్ కళాకారుల నైపుణ్యాన్ని ప్రత్యేకంగా చర్చించారు. జపాన్ ప్రధానికి బహుకరించిన సాంప్రదాయ వెండి బుద్ధుడి విగ్రహం, ఇటలీ ప్రధానికి అందించిన పూల ఆకారంలో తయారైన వెండి అద్దం-ఇవన్నీ కరీంనగర్కు చెందిన ప్రతిభావంతులైన కళాకారులు రూపొందించినవేనని మోడీ తెలిపారు. ఇటీవల హైదరాబాద్లో లో లీప్ ఇంజన్ (మెయింటెనెన్స్, రీపేర్, ఓవరాల్) ఫెసిలిటీని ప్రారంభించిన విషయాన్ని కూడా ప్రధాని మోడీ తన ప్రసంగంలో ప్రస్తావించారు. ఈ సౌకర్యంతో విమానాల మరమ్మత్తు, సంరక్షణ రంగంలో భారత్ సత్తా చాటుతుందని, ఇది భారత నూతన తరం ప్రతిభను ప్రతిబింబించే ఆవిష్కరణాత్మక అడుగుగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..