
వేములవాడ, 30 నవంబర్ (హి.స.) దక్షిణ కాశీగా పేరుగాంచిన
వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. ఆదివారం సెలవు దినం కావడంతో రాష్ట్రంలోని ఆయా ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి స్వామివారికి అత్యంత ప్రీతికరమైన కోడె మొక్కులతో పాటు ఇతర మొక్కులు చెల్లించుకొని అనంతరం స్వామివారిని దర్శించుకున్నారు. ఇదిలా ఉండగా స్వామివారిని సిద్దిపేట జిల్లా ఎన్నికల అబ్జర్వర్ హరిత తో పాటు జగిత్యాల జిల్లా ఎన్నికల అబ్జర్వర్ బి. రమేష్ లు దర్శించుకొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, కోడె మొక్కులు చెల్లించుకున్నారు.
మరోవైపు పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ కార్యనిర్వహణాధికారి (ఈ.వో) ఎల్. రమాదేవి భక్తులకు సంబంధించిన ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షించారు. ఉచిత దర్శనం, కోడె క్యూలైన్లు, క్యూలైన్లలో భక్తులకు ఎండ తగలకుండా ఏర్పాటు చేసిన టెంట్లు, అన్న పూజ టిక్కెట్లు 300 టికెట్ దర్శనం వంటి ఏర్పాట్లను క్షుణ్ణంగా పరిశీలించి, అధికారులకు, సిబ్బందికి సూచనలు చేశారు. వారి వెంట
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు