
ఖమ్మం, 30 నవంబర్ (హి.స.)
ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలో నాలుగు గ్రామపంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి. మధిర మండలంలో సిద్ధినేనిగూడెం, బోనకల్లు మండలంలో కలకోట, చింతకాని మండలంలో రేపల్లెవాడ, రాఘవపురం గ్రామపంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి. రాఘవపురం గ్రామపంచాయతీని సిపిఐ మద్దతుదారులు ఏకగ్రీవం చేసుకోగా, సిద్ధినేని గూడెం కలకోట రేపల్లె వాడ గ్రామ పంచాయతీలను అధికార కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు దక్కించుకున్నారు. పార్టీ తొలి విడతలో నియోజకవర్గంలో ఎర్రుపాలెం, మధిర, బోనకల్, చింతకాని మండలాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి.
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు