
ములుగు, 30 నవంబర్ (హి.స.) రెండవ సాధారణ గ్రామపంచాయతీ ఎన్నికల్లో భాగంగా ములుగు జిల్లాలో మొదటి విడత ఎన్నికలు జరగనున్న మూడు మండలాల్లో శనివారం సాయంత్రం ఐదు గంటలకు నామినేషన్ల దాఖల పర్వం ముగిసింది. జిల్లాలో మొదటి విడతగా ఏటూరునాగారం మండలంలోని 12 గ్రామ సర్పంచ్ పదవులకు, 114 వార్డు సభ్యులకు, ఎస్ఎస్ తాడ్వాయి మండలంలో 18 సర్పంచ్ పదవులు, 154 వార్డు సభ్యులకు, గోవిందరావుపేట మండలంలో 18 గ్రామ సర్పంచ్ పదవులకు, 152 వార్డు సభ్యులకు ఈ నెల 11న ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అధికారులు ఈ నెల 27 నుండి నామినేషన్ దాఖలు చేసుకోవడానికి అవకాశం కల్పించారు.
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు