
వనపర్తి, 30 నవంబర్ (హి.స.) వనపర్తి జిల్లా వీపన గండ్ల
మండల పరిధిలోని పుల్గర్ చెర్ల
గ్రామంలో ఓ ఇంట్లో శనివారం అర్ధరాత్రి జరుగుతున్న పేకాట శిబిరం జరుగుతున్న సమాచారం అందుకున్న పోలీసులు దాడి నిర్వహించి తొమ్మిది మంది పేకాట రాయుళ్లను అదుపులోకి తీసుకున్నారు. స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, శనివారం రాత్రి సుమారు 11 గంటల సమయంలో పేకాట జరుగుతోందన్న పక్కా సమాచారం అందడంతో సిబ్బందితో కలిసి అక్కడికి చేరుకొని దాడి చేపట్టారు. ఈ దాడిలో పేకాట ఆడుతున్న వారిని పట్టుకుని పోలీస్ స్టేషన్కు తరలించినట్లు తెలిపారు. అరెస్టు చేసిన వారి వద్ద రూ.8850 నగదు, పేకాట పత్తాలు స్వాధీనం చేసుకున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు