
అమరావతి, 30 నవంబర్ (హి.స.)
నెల్లూరు: నెల్లూరు జిల్లా రాపూరు - చిట్వేల్ ఘాట్ రోడ్డులో పెను ప్రమాదం తప్పింది. 13వ కిలోమీటరు లోయ వద్ద రెండు ఆర్టీసీ బస్సులు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ప్రమాద సమయంలో రెండు బస్సుల్లో 65 మందికి పైగా ప్రయాణికులు ఉన్నారు. అదృష్టవశాత్తూ ఎవరికీ గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. పోలీసులు, రవాణాశాఖ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఘాట్ రోడ్‌లో వేగం నియంత్రణపై సూచనలు చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ