
హైదరాబాద్, 30 నవంబర్ (హి.స.)
తెలంగాణలో పంచాయతీ ఎన్నికల వేడి కొనసాగుతోంది. నిన్నటితో తొలివిడత నామినేషన్లకు గడువు ముగియగా.. నేటి నుంచి రెండో విడత నామినేషన్లు మొదలయ్యాయి. ఈ మేరకు ఆదివారం ఉదయం ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. రెండో విడతలో 31 జిల్లాల్లో 193 మండలాల్లో 4333 సర్పంచ్ స్థానాలకు, 38,350 వార్డు సభ్యులకు విడతలో ఎన్నికలు నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటల నుంచి ఏర్పాటు చేసిన రిటర్నింగ్ ఆఫీసర్ కార్యాలయాల్లో నామినేషన్లను సాయంత్రం 5 గంటల వరకు స్వీకరించనున్నారు. ఆదివారం అయినా కూడా ఎన్నికల నామినేషన్లు స్వీకరించేందుకు ఏర్పాట్లు చేశారు.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..