
అమరావతి, 30 నవంబర్ (హి.స.):రిజిస్ట్రేషన్ శాఖలో చోటుచేసుకున్న పరిణామాలపై ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వ నిర్ణయాలను ధిక్కరించే సాహసం చేస్తారా? అంటూ ఇద్దరు అధికారుల తీరును తప్పుబట్టింది. అసలు రిజిస్ట్రేషన్‌శాఖలో ఏం జరుగుతోందంటూ స్వయంగా సీఎం చంద్రబాబు ఆరాతీశారు. రేణిగుంట సబ్‌రిజిస్ట్రార్‌గా ఆనందరెడ్డికి డిప్యుటేషన్ ఇస్తూ ఆదేశాలు ఇవ్వడంపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. తక్షణ చర్యలు తీసుకునేందుకు గాను దీనికి బాధ్యులైన వారిని గుర్తించాలని ఆయన ఆదేశించినట్లు సమాచారం. కాగా, ఆనందరెడ్డిని రేణిగుంట సబ్‌రిజిస్ట్రార్‌గా నియమిస్తూ చిత్తూరు ఇన్‌చార్జి డీఐజీ ఇచ్చిన డిప్యుటేషన్ ఉత్తర్వులను తక్షణమే రద్దుచేయాలని రెవెన్యూశాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి. సాయిప్రసాద్‌ను ఆదేశించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ