నామినేషన్ స్వీకరణ కేంద్రాన్ని సందర్శించిన జిల్లా కలెక్టర్
సూర్యాపేట, 30 నవంబర్ (హి.స.) సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ మునగాల మండల కేంద్రం నామినేషన్ స్వీకరణ కేంద్రాన్ని ఆదివారం అకస్మాత్తుగా సందర్శించారు. నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ, భద్రతా ఏర్పాట్లు, సిబ్బంది విధులు, సీ.సీ కెమెరాల పర్యవేక్ష
సూర్యాపేట కలెక్టర్


సూర్యాపేట, 30 నవంబర్ (హి.స.)

సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ మునగాల మండల కేంద్రం నామినేషన్ స్వీకరణ కేంద్రాన్ని ఆదివారం అకస్మాత్తుగా సందర్శించారు. నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ, భద్రతా ఏర్పాట్లు, సిబ్బంది విధులు, సీ.సీ కెమెరాల పర్యవేక్షణ తదితర అంశాలను అధికారులు సమగ్రంగా పరిశీలించారు.

అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని, ఎన్నికల నియమావళి కచ్చితంగా అమలులో ఉండాలని కలెక్టర్ సూచించారు. కేంద్ర పరిసరాల్లో చట్టం-శాంతి పరిస్థితులు క్రమంగా ఉండే విధంగా తగిన బందోబస్తు కొనసాగించాలని ఆదేశించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande