
వనపర్తి, 30 నవంబర్ (హి.స.)
నామినేషన్ ప్రక్రియ సజావుగా
నిర్వహించాలని వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి అధికారులకు సూచించారు. జిల్లాలో రెండో దశ గ్రామపంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో నామినేషన్ స్వీకరణ కేంద్రాల్లోకి ముగ్గురి కంటే ఎక్కువ మందిని అనుమతించవద్దని ఆయన ఆదేశించారు. ఆదివారం రెండో దశ గ్రామపంచాయతీ ఎన్నికల్లో భాగంగా నామినేషన్ల స్వీకరణ మండల కేంద్రంలోని రైతువేదికలో ఏర్పాటు చేసిన నామినేషన్ స్వీకరణ కేంద్రాలను సందర్శించారు.
కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో గ్రామపంచాయతీ ఎన్నికల నామినేషన్ స్వీకరణ ప్రక్రియ ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా, సజావుగా నిర్వహించాలని రిటర్నింగ్ అధికారులకు ఆదేశించారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు