చలి ఎఫెక్ట్: తెలుగు రాష్ట్రాల్లో పెరిగిన చికెన్-మటన్ ధరలు.
హైదరాబాద్, 30 నవంబర్ (హి.స.) తెలుగు రాష్ట్రాల్లో చలికాలం ఎఫెక్ట్ స్పష్టంగా కనిపిస్తోంది. ఉష్ణోగ్రతలు పడిపోవడంతో నాన్వెజ్ డిమాండ్ పెరిగి చికెన్ ధరలు స్వల్పంగా పెరిగాయి. ఆదివారం హైదరాబాద్లో స్కిన్లెస్ చికెన్ కిలో ధర రూ.250 నుంచి రూ.280 వరకు కూడా నమ
చలి ఎఫెక్ట్


హైదరాబాద్, 30 నవంబర్ (హి.స.)

తెలుగు రాష్ట్రాల్లో చలికాలం ఎఫెక్ట్ స్పష్టంగా కనిపిస్తోంది. ఉష్ణోగ్రతలు పడిపోవడంతో నాన్వెజ్ డిమాండ్ పెరిగి చికెన్ ధరలు స్వల్పంగా పెరిగాయి. ఆదివారం హైదరాబాద్లో స్కిన్లెస్ చికెన్ కిలో ధర రూ.250 నుంచి రూ.280 వరకు కూడా నమోదవుతున్నది. మరోవైపు ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి ఇలానే ఉండగా అక్కడ ధర రూ.240 నుంచి రూ.270 వరకు ఉంది.

మటన్ ధరలు ఇప్పటికే గరిష్ట స్థాయిలోనే ఉండగా, మార్కెట్లో రూ.900 పైగా విక్రయించబడుతోంది. గుడ్డు ధర కూడా రూ.7 నుంచి రూ.8 వరకు పలుకుతోంది. చలికాలం కొనసాగుతున్నందున రాబోయే రోజుల్లో డిమాండ్ మరింత పెరిగే అవకాశం ఉండడంతో ధరలు ఇంకాస్త పెరిగే అవకాశం ఉందని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande