

అమరావతి, 30 నవంబర్ (హి.స.)
నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న దిత్వా తుపాను.. ఏపీ- తమిళనాడు తీరంవైపు దూసుకొస్తోందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. గడిచిన 6 గంటల్లో 5 కిలోమీటర్ల వేగంతో కదిలిన తుపాన్.. ప్రస్తుతం కారైకాల్ కు 80కిలోమీటర్లు, పుదుచ్చేరికి 160 కిలోమీటర్లు, చెన్నైకి 250 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని పేర్కొంది. రానున్న 24 గంటల్లో ఇది ఉత్తర తమిళనాడు - పుదుచ్చేరి తీరాలకు సమాంతరంగా కదిలే అవకాశం ఉన్నట్లు అంచనా వేసింది. మరికొన్నిగంటల్లో ఇది తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉన్నట్లు తెలిపింది.
ఈ తుపాను కారణంగా.. నేడు ఏపీలో మూడు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ అయింది. ప్రకాశం, నెల్లూరు, తిరుపత జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని APSDMA హెచ్చరించింది. ప్రకాశం, కడప, అన్నమయ్య జిల్లాలోనూ భారీ వర్షాలు కురుస్తాయని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ అలర్ట్ జారీ చేసింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV