
తిరుమల, 30 నవంబర్ (హి.స.) తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వీకెండ్ కావడంతో శ్రీవారి దర్శనం కోసం భక్తులు పోటెత్తారు. ఆదివారం ఉదయానికి స్వామివారి సర్వదర్శనం కోసం 14 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్లులేని భక్తులకు స్వామివారి దర్శనానికి 15 గంటల సమయం పడుతుందని టీటీడీ తెలిపింది. నిన్న (శనివారం) స్వామివారిని 79,791 మంది భక్తులు దర్శించుకోగా.. భక్తులు సమర్పించిన హుండీ కానుకలు రూ.3.73 కోట్లు వచ్చినట్లు పేర్కొంది.
దిత్వా తుపాను ప్రభావం తిరుపతిపై తీవ్రంగా ఉంటుందని అధికారులు హెచ్చరించిన విషయం తెలిసిందే. ఇప్పటికే తిరుమలలో వర్షాలు కురుస్తుండగా.. తిరుమలపై కూడా వర్షాలు ఇబ్బంది పెడుతున్నాయి. ఓ పక్క చలి, మరోవైపు వర్షం కురుస్తున్నా.. స్వామివారిని దర్శించుకునేందుకు క్యూలైన్లలోకి చేరుకుంటున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV