తిరుమల శ్రీవారి సేవలో ప్రముఖులు.. తమిళనాడు గవర్నర్ సైతం
తిరుమల, 30 నవంబర్ (హి.స.) తిరుమల శ్రీవారిని తమిళనాడు గవర్నర్ ఆర్.ఎన్ రవి దర్శించుకున్నారు. ఆదివారం వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో ఆయన కుటుంబ సభ్యులతో కలిసి స్వామి వారి సేవలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీటీడీ అధికారులు వారికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట
prominent-people-in-the-service-of-tirumala-tirupati-srivari-499171


తిరుమల, 30 నవంబర్ (హి.స.) తిరుమల శ్రీవారిని తమిళనాడు గవర్నర్ ఆర్.ఎన్ రవి దర్శించుకున్నారు. ఆదివారం వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో ఆయన కుటుంబ సభ్యులతో కలిసి స్వామి వారి సేవలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా టీటీడీ అధికారులు వారికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో ఆర్‌.ఎన్‌ రవికి పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.

అలాగే ఆదివారం వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో పలువురు ప్రముఖులు శ్రీవారిని దర్శించుకున్నారు. వైసీపీ ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి, వైసీపీ ఎంపీ మద్దిల గురుమూర్తి, ప్రముఖ నిర్మాత అంబికా కృష్ణ, హాస్యనటుడు రోలర్ రఘు తదితరులు స్వామివారిని దర్శించుకున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande