
అమరావతి, 30 నవంబర్ (హి.స.) మంగళగిరి విద్యాభివృద్ధికి మరో గౌరవ కిరీటం జతకట్టింది. డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం విడుదల చేసిన పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఫలితాల్లో మంగళగిరి సాయి నగర్‌కు చెందిన పాపన జితేంద్ర రాష్ట్రంలోనే ప్రథమ స్థానాన్ని సాధించారు. ఆర్థోపెడిక్ విభాగంలో అగ్రస్థానంతో నిలిచిన ఆయన ప్రతిభ పట్ల రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆదివారం ట్విట్టర్ వేదికగా అభినందనలు తెలిపారు.
జితేంద్ర సతీమణి అమృత వర్షిణి కూడా ఎంఎస్ ఆప్తమాలజీ విభాగంలో రాష్ట్రస్థాయిలో 5వ ర్యాంక్ సాధించి విశేష ప్రతిభ చాటారు. జితేంద్ర, అమృత వర్షిణిల విజయాలు మంగళగిరి ఖ్యాతిని మరింత పెంచాయని మంత్రి పేర్కొన్నారు. భవిష్యత్తులో ఇద్దరూ మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, వైద్య రంగంలో సేవలతో రాష్ట్ర ప్రతిష్టను పెంపొందించాలని, మంగళగిరి ఖ్యాతిని పెంచాలని లోకేష్ ఆకాంక్షించారు
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV