మొంథా తుఫాను కారణంగా దెబ్బతిన్న పంట.ల నష్టం అంచనా పెరిగింది
అమరావతి, 4 నవంబర్ (హి.స.) మొంథా తుఫాన్‌ ప్రభావంతో దెబ్బతిన్న వ్యవసాయ పంటల నష్టం అంచనా పెరిగింది. 1,38,391 హెక్టార్లలో పంటలు మునిగాయని వ్యవసాయశాఖ తొలుత ప్రాథమికంగా అంచనా వేయగా, గత ఐదు రోజులుగా క్షేత్రస్థాయిలో ఎన్యూమరేషన్‌ చేశాక నష్టం అంచనా దాదాపు 11
మొంథా తుఫాను కారణంగా దెబ్బతిన్న పంట.ల నష్టం అంచనా పెరిగింది


అమరావతి, 4 నవంబర్ (హి.స.) మొంథా తుఫాన్‌ ప్రభావంతో దెబ్బతిన్న వ్యవసాయ పంటల నష్టం అంచనా పెరిగింది. 1,38,391 హెక్టార్లలో పంటలు మునిగాయని వ్యవసాయశాఖ తొలుత ప్రాథమికంగా అంచనా వేయగా, గత ఐదు రోజులుగా క్షేత్రస్థాయిలో ఎన్యూమరేషన్‌ చేశాక నష్టం అంచనా దాదాపు 11వేల హెక్టార్లు పెరిగి... 1,49,302 హెక్టార్లకు చేరినట్లు సోమవారం రాత్రికి అధికారులు నమోదు చేశారు. కర్నూలు, శ్రీసత్యసాయి జిల్లాలు మినహా 24జిల్లాల్లో 387మండలాల్లోని 3,849 గ్రామాల్లో అధికారులు ఎన్యూమరేషన్‌ పూర్తిచేశారు. అత్యధికంగా కోనసీమ జిల్లాలో 29,322 హెక్టార్లు, కృష్ణాలో 23,980, కాకినాడలో 20,791, తూర్పుగోదావరిలో 13,629 హెక్టార్లలో పంట నష్టం జరిగినట్లు అధికారులు తేల్చారు. నష్టపోయిన రైతులజాబితాలను ఎప్పటికప్పుడు రైతుసేవాకేంద్రాల్లో సోషల్‌ ఆడిట్‌ కోసం ప్రదర్శిస్తున్నారు. అభ్యంతరాలు, విజ్ఞప్తులను స్వీకరిస్తున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande