మొంథా తుఫాను విద్యుత్ వ్యవస్థకు తీవ్ర నష్టాన్ని కలిగించింది
గుంటూరు,, 4 నవంబర్ (హి.స.) :మొంథా తుఫాన్‌ విద్యుత్‌ వ్యవస్థకు తీవ్ర నష్టాన్ని కలిగించింది. ఉమ్మడి కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల పరిధిలోనున్న ఆంధ్రప్రదేశ్‌ సెంట్రల్‌ పవర్‌ డిస్ట్రిబ్యూషన్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఏపీ సీపీడీసీఎల్‌)కు రూ.10 కోట్ల న
మొంథా తుఫాను విద్యుత్ వ్యవస్థకు తీవ్ర నష్టాన్ని కలిగించింది


గుంటూరు,, 4 నవంబర్ (హి.స.) :మొంథా తుఫాన్‌ విద్యుత్‌ వ్యవస్థకు తీవ్ర నష్టాన్ని కలిగించింది. ఉమ్మడి కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల పరిధిలోనున్న ఆంధ్రప్రదేశ్‌ సెంట్రల్‌ పవర్‌ డిస్ట్రిబ్యూషన్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఏపీ సీపీడీసీఎల్‌)కు రూ.10 కోట్ల నష్టం వాటిల్లినట్లు అంచనాలు తయారు చేశారు. బలమైన గాలులకు ప్రధానంగా కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో ఫీడర్లు, సబ్‌స్టేషన్లు, ట్రాన్స్‌ఫార్మర్లు దెబ్బతిన్నాయి. డిస్కం పరిధిలో 965 సబ్‌స్టేషన్లు ఉండగా 200 సబ్‌ స్టేషన్లు దెబ్బతిన్నాయని, 450 ఫీడర్లు ఉండగా వాటిలో 100 ఫీడర్లు దెబ్బతిన్నాయని, 3 లక్షల ట్రాన్స్‌ఫార్మర్లు ఉండగా 700 దెబ్బతిన్నాయని నివేదికలు రూపొందించారు. ఇందులోభాగంగా.. మచిలీపట్నం, ఉయ్యూరు డివిజన్‌తోపాటు బాపట్ల జిల్లాలోని పలుప్రాంతాల్లో మంగళవారం సీపీడీసీఎల్‌ సీఎండీ పుల్లారెడ్డి, టెక్నికల్‌ డైరెక్టర్‌ ఆవుల మురళీకృష్ణయాదవ్‌ పర్యటించనున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande