వరుస బస్సు ప్రమాదాలు కలవర పరుస్తున్నాయి: కేంద్ర మంత్రి బండి సంజయ్
హైదరాబాద్, 4 నవంబర్ (హి.స.) వరుస బస్సు ప్రమాదాల నేపథ్యంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ ఎక్స్ వేదికగా ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. బస్సు ప్రమాదాలు తనను కలవరపరుస్తున్నాయని బండి ట్వీట్ చేశారు. ఆయన ట్వీట్లో ఈరోజు తెల్లవారుజామున కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మ
బండి సంజయ్


హైదరాబాద్, 4 నవంబర్ (హి.స.) వరుస బస్సు ప్రమాదాల నేపథ్యంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ ఎక్స్ వేదికగా ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. బస్సు ప్రమాదాలు తనను కలవరపరుస్తున్నాయని బండి ట్వీట్ చేశారు. ఆయన ట్వీట్లో ఈరోజు తెల్లవారుజామున కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రేణుకుంట బ్రిడ్జి వద్ద జరిగిన బస్సు-ట్రాక్టర్ ప్రమాదం బాధాకరం.విషయం తెలిసిన వెంటనే జిల్లా కలెక్టర్ ప్రమేల సత్పత్తితో పాటు ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులతో, పోలీస్ అధికారులతో ఫోన్ లో మాట్లాడటం జరిగింది. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని.. అవసరమైతే హైదరాబాదు తరలించాలని అధికారులకు సూచించడం జరిగింది. ఈ విషయంలో ఎలాంటి సహాయం కావాలన్నా అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించడం జరిగింది.

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande