
అమరావతి, 5 నవంబర్ (హి.స.)
అమ్రాబాద్: నాగర్‌కర్నూలు జిల్లా పరిధిలోని శ్రీశైలం ఘాట్ రోడ్డులో ఓ తెలంగాణ ఆర్టీసీ బస్సు అదుపు తప్పింది. హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళ్తున్న బస్సు అమ్రాబాద్ మండలంలోని అక్కమహాదేవి గుహలకు వెళ్లే మార్గం వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. ఇటీవల కురిసిన వర్షాలకు బురదమయమైన ప్రదేశంలో బస్సు కూరుకుపోయి రోడ్డుకు అడ్డంగా తిరిగింది. అయితే అందులోని ప్రయాణికులకు ఏ ఇబ్బంది కలగలేదు. రోడ్డుకు అడ్డంగా బస్సు ఉండిపోవడంతో ఆ మార్గంలో రాకపోకలకు అంతరాయం కలిగింది. సుమారు గంట సేపు వాహనాలు నిలిచిపోయాయి. ఈగలపెంట ఎస్సై జయన్న, పోలీసులు అక్కడికి చేరుకుని ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. ప్రయాణికుల సహాయంతో బస్సును రోడ్డుపైకి ఎక్కించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ